YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇక్కడో మాట..అక్కడో మాట

ఇక్కడో మాట..అక్కడో మాట
చంద్రబాబుకు దేశ ప్రయోజనాలు పట్టవు. టిడిపి దొంగలను రక్షించేందుకు చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తారు. ఆంధ్రప్రదేశ్ దోపిడీ దొంగలకు కేంద్రంగా మారిందని వైకాపా నేత బోత్స సత్యనారాయణ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు టిఆర్ ఎస్ తో పొత్తుకావాలని అడిగారని కేటిఆర్ చెప్పారు. టిఆర్ ఎస్ పొత్తును తిరస్కరిస్తే చంద్రబాబు కాంగ్రెస్ తో కలిశారు. టిఆర్ ఎస్ తో పొత్తు ప్రతిపాదనపై టిడిపి వివరణ ఇవ్వాలి. చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేయలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు నీతిపరుడు ఎలా అయ్యాడు. పవన్ కల్యాణ్ ప్రవచనాలు చెబుతుంటారు. పవన్ కల్యాణ్ మాట్లాడేటప్పుడు వెనకముందు చూసుకుని మాట్లాడాలి. ఇది సినిమా కాదు.రాజకీయాలు వేరు సినిమా వేరు.ఇది పవన్ కల్యాణ్ గ్రహించాలి. ప్రతిపక్షనేతపై పవన్ కల్యాణ్ విమర్శలు అర్దంలేనివి. చంద్రబాబు కనుసన్నలలో జనసేన నడుస్తోందని అయన ఆరోపించారు. జనసేనతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు ఏమిటి? -చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. చంద్రబాబుది తెలంగాణాలో ఓ మాట.ఏపిలో మరోమాట. టిడిపిలోని అవినీతిపరులను కాపాడేందుకే చంద్రబాబు సిబిఐని రాష్ర్టంలోకి రానీయడంలేదు. వైయస్సార్ కాంగ్రెస్ ఎప్పుడూ కూడా రాష్ర్ట ప్రయోజనాలనే ఆశిస్తోంది.  టిడిపి అవినీతిని పవన్ కల్యాణ్ పక్కదారి పట్టిస్తున్నారు. చంద్రబాబుది దృతరాష్ర్టుడి కౌగిలి...పవన్ కల్యాణ్ ఆలోచించుకో. ఓటుకు నోటు కేసుతో ఉమ్మడి రాజధానిని వదులుకున్నారు.. ప్రత్యేక హోదా ఇస్తామంటే ఏ పార్టీకి అయినా మధ్దతు ఇస్తామని శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు. కేజిబేసిన్ గ్యాస్ గురించి వైయస్ రాజశేఖరరెడ్డి ఆనాటి ప్రధానిమంత్రికి లేఖరాశారు. కేజిబేసిన్ ఆంధ్రుల ఆస్ది అని ఆందోళనలు కూడా అప్పటి మా మంత్రుల ఆధ్వర్యంలో నడిచాయి. ప్రత్యేకహోదా కోసం టిడిపి ఆడుతున్న డ్రామాలను నమ్మద్దనేది మా పార్టీ భావన అని అయన అన్నారు.

Related Posts