ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగుల నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. గురువారం ఉదయం ఏయూ పరిపాలనా భవనం ఎదురుగా నిరాహార దీక్షలు కొనసాగించారు. దశాబ్దాలుగా 28 రోజులు, టైం స్కేల్ విధానంలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని కోరుతూ ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని తమకు ఉద్యోగ బద్రత కల్పించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఉదయం వర్సిటీ పరిపాలనా భవనం నుంచి ఏయూ మెయిన్ గేట్ వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ జరిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగిచకుండా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఏయూ జేఏసి అద్యక్షుడు డాక్టర్ జి. రవికుమార్ అధ్వర్యంలో ఉద్యోగులంతా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ న్యాయ బద్ధమైన 14 సమస్యలతో తాము ఈ పోరాటానికి సిద్దమయ్యామన్నారు. వర్సిటీ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందించే విధంగా పాలకులు పనిచేయాలన్నారు. జేఏసీ ఉపాద్యక్షుడు ఆచార్య డి.వి రామకోటి రెడ్డి మాట్లాడుతూ చిత్తశుద్దిలో పనిచేసే నాయకులతో తాము నిలుస్తామన్నారు. వారం రోజుల్లో పరిష్కరిస్తామని స్థానక ఎమ్మెల్యే చెప్పారని దీనిని నిలుపుకోవాలన్నారు. అటానమస్ వ్యవస్థగా నిలుస్తున్న ఏయూలో ఉద్యోగులకు భధ్రత కల్పించడంలో పలు జీవోల సాకు చూపుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. ఆర్గనైజంగ్ సెక్రటరీ లక్ష్మణ రావు యింట్ సెక్రటరీలు ఎన్.కె ఫరీద్ లు మాట్లాడుతూ సమస్య పరిష్కరించని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేసి వర్సిటీని స్థంభింపచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.కెఖాలీషా, సిహెచ్. రమణ, ఏ.దుర్గాప్రసాద్, బి.రాము, కె.కృష్ణ, కె.ధర్మారావు, కె. సూర్యనారాయణ, సత్యనారాయణ, జాయింట్ సెక్రట్రి ఎస్.కె.ఫరీద్, అప్పలరాజు తదితరులు ప్రసంగించారు.