YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆయేషా మీరా హత్య కేసు మరో కొత్త మలుపు మళ్లీ విచారణ చేయాలంటూ సీబీఐకి హైకోర్టు ఆదేశం

ఆయేషా మీరా హత్య కేసు మరో కొత్త మలుపు      మళ్లీ విచారణ చేయాలంటూ సీబీఐకి హైకోర్టు ఆదేశం
విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఆయేషా మీరా హత్య కేసును మళ్లీ విచారణ చేయాలంటూ సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. కేసును మొదటి నుంచి విచారణ చేయాలని సీబీఐకి సూచించింది. కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేయాలని సీబీఐకు కోర్టు తెలిపింది.ఆయేషా మీరా హత్య కేసులో శిక్ష అనుభవించిన సత్యంబాబును2016లో నిర్దోషిగా హైకోర్టు ప్రకటించింది. ఆ తర్వాత ఈ కేసును పునర్విచారణ చేపట్టాలంటూ.. ఏపీ పోలీసులను ఆదేశించింది. దీంతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిట్ దర్యాప్తు తీరుపై ఆయేషా మీరా తల్లిపలు మహిళా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో ఆయేషా మీరా హత్య కేసును దర్యాప్తు చేసిన సిట్ ఇన్వెస్టిగేషన్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.2007 డిసెంబర్ 27న విజయవాడలోని శ్రీదుర్గ లేడీస్ హాస్టల్‌లో బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. బాత్రూమ్‌ సమీపంలో ఆమె మృతదేహం పడి ఉంది. ఒంటినిండా రక్తపు గాయాలయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. నాటి మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు బంధువును కాపాడటం కోసం అమాయకులను దోషులుగా చేసి అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. అనేక మందికి నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించారు. డీఎన్‌ఏ ఫలితాలు కూడా తారుమారు అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. విజయవాడ కోర్టు కస్టడీలో ఉన్న ఆయేషా మీరా కేసు ఆధారాలను నాశనం చేశారంటూ ఆయేషా మీరా తల్లి హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించాలని కోర్టు స్పష్టం చేసింది.

Related Posts