YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోడీపై ఆశలన్నీ నిరాశలే కలెక్టర్ల భేటీలో సీఎం చంద్రబాబు

 మోడీపై ఆశలన్నీ నిరాశలే కలెక్టర్ల భేటీలో సీఎం చంద్రబాబు
విద్యుత్ రంగంలో సంస్కరణలను ఆంధ్రప్రదేశే తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎపి అభివృద్ధికి 2024 విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. శుక్రవారం అమరావతిలో కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ తాను రాష్ట్రానికి పరిమితమైపోవడం భావ్యం కాదని చెప్పారు. దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన అవసరముందని ఆయన అన్నారు. పరిపాలన, రాజకీయం రెండూ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కేవలం ఏపీకే పరిమితం కాకుండా దేశం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ హయాంలోనే జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు వచ్చిందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా నిర్మించాలని ప్రణాళికా సంఘం సిఫార్సు చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ.16వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఆరోజు ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో… ఇప్పుడంతా నిరాశలో కూరుకుపోయారని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మోడీ పాలనపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయేలా ఉందన్నారు. మోడీ పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ ను కట్టలేదని చెప్పడంపై వ్యాఖ్యానిస్తూ నేను హైదరాబాద్ ను కట్టలేదు. దాన్ని కులీకుతుబ్ షానే కట్టారని కేసీఆర్ చెప్పా. సైబరాబాద్ తో పాటు నగరంలో నేను చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించాని అన్నారు.  కేసీఆర్ గత నాలుగున్నరేళ్లలో ఒక్క ఫాంహౌస్ ను తప్ప ఇక దేన్నీ కట్టలేదు’ అని విమర్శించారు. ఓ పనిని ప్రారంభించడం ఎంత ముఖ్యమో, పూర్తిచేయడం కూడా అంతే ముఖ్యమని అన్నారు.

Related Posts