చేనేతల కోసం టీడీపీ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పవన్ కి కనపడటం లేదా. చేనేతల కోసం పవన్ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. హ్యాండ్లూమ్ మీద 5 శాతం జిఎస్టీ తొలగించమని ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాశామని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. చేనేత కి బ్రాండ్ అంబాసిడర్ నేనే అని పవన్ ప్రకటించుకోవటం హాస్యాస్పదం. చేనేతల సమస్యలను జనసేన మేనిఫెస్టోలో ఎందుకు చేర్చలేదని అమె ప్రశ్నించారు. బోట్ రేసింగ్ కి 400 కోట్లు ఖర్చు చేసారని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఒక పార్టీ అధ్యక్ష హోదాలో అవాస్తవాలు మాట్లాడటం పవన్ కి తగదని అనురాధ అన్నారు.