YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫైనాన్స్ వ్యాపారి మర్డర్ కేసులో ఇద్దరి ఆరెస్టు

ఫైనాన్స్ వ్యాపారి మర్డర్ కేసులో ఇద్దరి ఆరెస్టు
ఫైనాన్స్ వ్యాపారి గగారిన్ హత్యకేసు నిందితులు మద్దాల సురేష్, సుధాకర్ లను పోలీసులు అరెస్ట్ చేసారు. కేసు వివరాలు ఏసీపీ రమణ మూర్తి మీడియాకు వెల్లడించారు.  పక్కా ప్రణాళికతోనే గగారిన్ హత్య జరిగింది.  ఆస్తి లావాదేవి వ్యవహారమే గగారిన్ హత్యకు ప్రధాన కారణమని అయన అన్నారు.  గగారిన్ తన కార్యాలయంలో ఒంటరిగా ఉంటున్నట్టు అన్నదమ్ములు రెక్కి నిర్వహించారు. నిందితులు తిప్పనగుంటలోని తమ ఇంటి నుండే ఒక కత్తిని , బాటిల్ లో పెట్రోల్ ను తీసుకొని గగారిన్ ఆఫీస్ కి చేరుకున్నారు.  మద్దాల సురేష్ తన బ్యాగ్ లో ఉన్న పెట్రోల్ బాటిల్ ను గగారిన్ పై పోసి నిప్పంటిచారు.. మంటల్లో కాలిపోతున్న గగారిన్ స్ధానికులకి మద్దాల సురేష్, సుధాకర్ లు తనపై పెట్రోల్ పోశారని చెప్పాడు..  పెట్రోల్ దాడి ఫెయిల్ అయితే కత్తితో దాడికి కూడా సిద్దమయ్యే మద్దాల సురేష్ స్పాట్ కి చేరుకున్నారని అయన అన్నారు.
తొలుత హత్నాయత్నం క్రింద కేసు నమోదుచేసి, గగారిన్  చనిపోయిన తరువాత హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసారు.  ప్రాధమిక దర్యాప్తులో గగారిన్ మృతి చెందకమునుపు అతని నుండి వాంగ్మూలం తీసుకోవడంతో పాటు చుట్టు ప్రక్కల నివాసితులు, బంధువులు, కుటుంబ సభ్యులను విచారించి దాడికి గురైన గగారిన్ కు సంబంధించి ఆర్ధిక వివాదాలు, ఆస్థి లావాదేవీలు,  పాత కక్ష్యల పై, సమగ్ర సమాచారం సేకరించడంతో పాటు ప్లాజాలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించి దాడికి పాల్పడిన నిందితుల ఆనవాళ్ళను , దాడికి దారితీసిస పరిస్థితులను గుర్తించడం జరిగిందని అయన అన్నారు. నిందితులు, హతుడి మధ్య ఒక ఇంటి విషయంలో కోర్టులో కేసు నడుస్తోందిని ఏసీపీ తెలిపారు.

Related Posts