ఆంధ్రవిశ్వద్యాలయంలో పనిచేస్తున్న 28 రోజులు, టైం స్కేల్ ఉద్యోగులకు శాస్వత ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉద్యోగులు చేస్తున్న నిరసనలు, దీక్షలు నాలుగోరోజు కొనసాగాయి. ఏయూ పరిపాలనా భవనం వద్ద శుక్రవారం ఉదయం నుంచి నిరసనలు కొనసాగాయి. పెద్దసంఖ్యలో ఉద్యోగులు పాల్గొని తమ న్యాయబద్దమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరారు. ఏయూ పరిపాలనా భవనం ఎదురుగా ఏయూజేఏసి అద్యక్షుడు డాక్టర్. జి రవికుమార్ అధ్వర్యంలో ఉద్యోగులంతా ధర్నలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ న్యాయ బద్ధమైన 14 సమస్యలతో తాము ఈ పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. వర్సిటీ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు అందించాలన్నారు. ఈ దిశగా పాలకులు పనిచేయాలన్నారు. ఆర్గనైజంగ్ సెక్రటరీ ఇ.లక్ష్మణ రావు, జాయింట్ సెక్రటరీలు ఎస్.కె.ఫరీద్ లు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామన్నారు.