YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

విరాట్ తో అంత వీజీ కాదు :డీన్‌జోన్స్

విరాట్ తో అంత వీజీ కాదు  :డీన్‌జోన్స్
కెప్టెన్ విరాట్ కోహ్లీ బలహీనతలపై ఆస్ట్రేలియా బౌలర్లు ఓ కన్నేసి ఉంచాలని ఆ దేశ మాజీ క్రికెటర్ డీన్‌జోన్స్ సూచించాడు. డిసెంబరు 6 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. సుదీర్ఘకాలంగా అందని ద్రాక్షగా మిగిలిపోయిన టెస్టు సిరీస్‌ని ఈసారి గెలవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం వేటు పడటంతో స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌‌లు ఆసీస్ జట్టుకి దూరమయ్యారు. గత నాలుగేళ్లుగా ఆస్ట్రేలియా టీమ్ మొత్తం చేసిన పరుగుల్లో దాదాపు 40% పరుగులు ఈ ఇద్దరు క్రికెటర్లే చేశారని.. ఇప్పుడు వారు లేకపోవడంతో ఆసీస్ బలహీనంగా కనిపిస్తోందని డీన్‌జోన్స్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచేందుకు భారత్‌కి ఇదే మంచి అవకాశమని.. ఇప్పుడు ఒకవేళ సిరీస్‌ గెలవలేకపోతే.. ఎప్పటికీ గెలవలేదని అతను జోస్యం చెప్పాడు. ‘ఆస్ట్రేలియా జట్టుని సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టం. కానీ.. ప్రస్తుతం టీమ్‌లో స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లు లేరు. వారి స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లూ ప్రస్తుతం జట్టులో ఉండారని నేను అనుకోవట్లేదు. మరోవైపు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చగొట్టడం కంటే.. అతని బలహీతనలపై దృష్టి పెట్టడం ఉత్తమం. ముఖ్యంగా.. ఆరంభం నుంచే కోహ్లీ కవర్ డ్రైవ్స్‌ని నిలువరించాలి. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతులు విసురుతూ.. తొలుత అతను బ్యాక్‌ఫుట్‌పై ఎక్కువగా ఆడేలా చేయాలి. అలా అతడ్ని వెనక్కి తగ్గేలా చేస్తూ ఆఫ్ సైడ్‌లో వైడ్‌ రూపంలోనూ అప్పుడప్పుడు బంతులు విసిరాలి. అప్పుడే.. స్లిప్‌ లేదా గల్లీలో ఫీల్డర్‌కి కోహ్లీ చిక్కే అవకాశం ఉంటుంది’ అని డీన్‌జోన్స్ సూచించాడు. డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుండగా.. భారత సెలక్టర్లు ఇటీవల జట్టుని ప్రకటించారు. అయితే.. గాయం కారణంగా పృథ్వీ షా తొలి టెస్టుకి దూరమయ్యాడు. భారత్ టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ 

Related Posts