దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. దాదాపు రెండు నెలల గరిష్ట స్థాయిలో మార్కెట్లు ముగిశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి విలువ బలపడటం మార్కెట్లకు కలసి వచ్చింది. దీనికి తోడు జీ20 సమావేశాలపై కూడా ఇన్వెస్టర్లు ఒక కన్ను వేయడం గమనార్హం. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 24 పాయింట్లు లాభపడి 36,194కు పెరిగింది. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 10,877 వద్ద స్థిరపడింది.
టాప్ గెయినర్స్:
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (11.92%), ప్రిస్టేజ్ ఎస్టేట్స్ (8.74%), అలెంబిక్ ఫార్మస్యూటికల్స్ (8.35%), రెప్కో హోమ్ ఫైనాన్స్ (8.34%), స్ట్రెయిడ్స్ ఫార్మా సైన్స్ (6.95%).
టాప్ లూజర్స్:
ఆయిల్ ఇండియా (-7.54%), ఆర్ఈసీ లిమిటెడ్ (-6.28%), ఏజీస్ లాజిస్టిక్స్ (-6.15%), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (-6.09%), వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (-6.09%).