ఏపీలో ఉపాధ్యాయ పోస్టలు భర్తీకి సంబంధించి.. డీఎస్సీ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దీనిద్వారా అభ్యర్థులు తమ టెట్ హాల్‌టిక్కెట్ నంబర్, పేరు, తల్లిదండ్రుల పేర్లు, సెల్ ఫోన్ నెంబర్లు తదితర వివరాలను మార్పుచేసుకునే వీలుంది. అభ్యర్థులకు నుంచి డిసెంబరు 4 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. వివరాల్లో మార్పులు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబరు 5న సంక్షిప్త సందేశాలు పంపనున్నారు. వీరు డిసెంబరు 6న పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నమోదుచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు వెబ్‌సైట్‌లోని ద్వారా వారి వివరాలను నమోదుచేస్తే.. అధికారులు ఆన్లైన్ ద్వారా సవరించనున్నారు