వేగంగా వస్తున్న రైళ్ల కింద పడి 245 ఆవులు మృత్యువాత పడిన ఘటనలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో వెలుగుచూసింది. భండాయి- ఉది మోర్హ్ రైలుమార్గంలో గాజౌరా గ్రామం సమీపంలో వేగంగా వస్తున్న రైలును ఢీకొని పది ఆవులు మరణించాయి. మాణిక్ పురా హాల్ట్ రైల్వేస్టేషను సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించిన పది ఆవుల కళేబరాలను అధికారులు పూడ్చిపెట్టించారు. పాల్వాల్ నుంచి ధోల్పూర్ మధ్య ఉన్న 190 కిలోమీటర్ల దూరం రైలు మార్గంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరు 245 ఆవులు మరణించాయి. తరచూ రైళ్ల కింద పడి ఆవులు మరణిస్తున్న ఘటనలతో 410 రైళ్లు 5.212 నిమిషాల పాటు రైళ్ల రాకపోకల్లో జాప్యం జరిగిందని రైల్వే అధికారులు వెల్లడించారు. వరుసు రైలు ప్రమాదాల్లో ఆవులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.