రాష్ర్టంలో రాక్షస పాలన సాగుతోందని వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదా అనేది రాష్ర్టానికి ఊపిరి లాంటిదని వైయస్ జగన్ నాయకత్వంలో పోరాటాలను ప్రారంభించారు. పోరాటంలో యువతను,ప్రజలను భాగస్వామ్యం చేశారు.ఢిల్లీలో సైతం జంతర్ మంతర్ వద్ద హోదాపై దీక్ష,ధర్నా చేశారు. ఆరోజు పోలీసులు ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. హోదా కోసం గత నాలుగున్నరేళ్లుగా మనం పోరాటంచేస్తుంటే పోరాటం లో బాగంగా పార్లమెంట్ లో సైతం కేంద్రాన్ని నిలదీశారు. ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు నుంచి ప్రతి రోజు కేంద్రాన్ని నిలదీస్తూనే ఉన్నామని అయన అన్నారు. అప్పుటినుంచే ప్రత్యేక హోదా గురించి ఆంధ్రకు ఆన్యాయం జరుగుతున్న విషయం దేశ ప్రజలకు తెలిసింది. వైయస్ జగన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పార్లమెంట సమావేశాల చివరిరోజున రాజీనామాలు చేసి ఆమరణదీక్షచేశాం. ఆరోజున చంద్రబాబును సైతం అడిగాం.మీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించమని. కాని చంద్రబాబు ముందుకు రాలేదు.ఎందుకంటే తన అవినీతి ఎక్కడ కేంద్రం బయటకు తీస్తుందో అని అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా చేస్తున్న నాటకాలు ప్రజలకు తెలియచేయడంతోపాటు హోదా అవసరం రాష్ర్టానికి ఏ విధంగా మేలు చేస్తుంది అనే అంశాలను వివరించడమే వంచనపై గర్జన లక్షమని అన్నారు. చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని హోదా కావాలని అడుగుతున్నారు.గతంలో హోదా సంజీవనా అని ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు ఎలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.ఇదంతా ప్రజలు ఆలోచించాలని అన్నారు. రాష్ర్టంలో నవరత్నాలతో వైయస్ ఆర్ పాలన మరోసారి రాష్ర్టంలో వస్తుంది. ప్రజలకు భరోసా కల్పించేందుకు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రజాదరణ పొందుతుండటంతో ఓ ర్వలేక జగన్ గారిపై హత్యాయత్నంకు వడిగట్టారు. రాబోయే కాలంలో మన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అందరం కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించేందుకు నడుంకట్టాలని అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవడంతోపాటు పార్లమెంట్ కు సంభందించి 25 కి 25 పార్లమెంట్ స్దానాలు గెలిపించాలని అయన అన్నారు..