భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో సీతక్క కనిపించకపోవడంపై ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. ఈ సభకు భూపాలపల్లి, పరకాల, మంథని, హుజురాబాద్ నియోజకవర్గాల నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. కానీ, ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క హాజరుకాలేదు. కానీ, జిల్లాకు చెంది, పక్కనే ఉన్న నియోజకవర్గం నుంచి సీతక్క రావపోవడంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో సభ ప్రారంభంలో రాహుల్‌గాంధీ ప్రసంగం ముందుగా నాయకులను ప్రస్తావించారు. అలాగే హాజరైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు కూడా ఆరా తీశారు. ప్రచారంలో బిజీగా ఉండడం మూలంగా హాజరు కాలేదా? ప్రజాకూటమి సభలో పాల్గొనడం ఇష్టంలేక రాలేదా? అనే ది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమె ఎందుకు రాలేదని స్థానిక నేతలను అడిగినట్లు సమాచారం. భూపాలపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముందస్తుగానే షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ సభకు భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలతో పాటు పక్కనే ఉన్న మంథని, పరకాల, హుజురాబాద్, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి కూడా అభ్యర్థులను పాల్గొనాలని రాహుల్‌గాంధీ సూచించినట్లు పార్టీ నేతలు తెలుపుతున్నారు.