కృష్ణా జిల్లాలో , గూడూరు మండలం లోని తరకటూరు గ్రామం, మచిలీపట్నం విజయవాడ NH మీద ఉంది. ఈ రోడ్డుకు ఇరువైపులా రైతులు ఇటు నుండి అటు వైపుకు వెళ్ళవలసి వస్తుంది పొలం పనుల గురించి. విజయవాడ మార్గంలో తరకటూరు కి ఒక కిలోమీటరు దూరంలో హైవే మీద డివైడర్ కట్ చిన్న గూడూరు లంక దగ్గర ఉంది . అదేవిధంగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం వైపు నిడుమొలు దగ్గర డివైడర్ కట్ ఉంది. తరకటూరు ను ఆనుకొని అనేక గ్రామాలు( కాజా, మద్దిపట్ల, కొంచ కోడూరు, పెద్దరాయుడు తోట కొత్తపాలెం కోసూరు వీరాయలలంక ) ఉన్నాయి. రైతులకు రోడ్డుకు ఆ వైపుల పొలాలు ఉండటం వలన, పొలం పనుల , సరుకుల రవాణా విషయంలో రైతులు, బళ్ళు చాలా దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది లేదా ట్రాఫిక్ కి వ్యతిరేకంగా వెళ్ళ వలసి వస్తుంది. కావున అధికారులు ఒకసారి తరకటూరు గ్రామం సందర్శించి గ్రామస్తులు యొక్క సమస్యను ఆలకించి సరైన పరిష్కార మార్గం సూచించగలరు.