నెల్లూరు మాజీ ఎంపీ డాక్టర్ ఉక్కాల రాజేశ్వరమ్మ మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. మంత్రి మాట్లాడుతూ మాజీ ఎంపీ దొడ్డవరపు కామాక్షయ్య వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజేశ్వరమ్మ ప్రత్యేక గుర్తింపు పొందారు. నెల్లూరు ఎంపీగా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి ప్రజానేతగా మంచిపేరు సాధించారని కొనియాడారు. అనారోగ్యంతో బాధపడుతూ రాజేశ్వరమ్మ మృతి చెందడం బాధాకరం.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఆదివారం జరిగే రాజేశ్వరమ్మ అంత్యక్రియలకు హాజరవుతానని అన్నారు.