చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. మామిడిమానుగడ్డ అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్సు సిబ్బందికి 60 మంది స్మగ్లర్లు తారసపడ్డారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు యత్నించిన సిబ్బందిపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. దీంతో సిబ్బంది ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఇద్దరు తమిళ స్మగ్లర్లు, చిత్తూరుకు చెందిన మరో స్మగ్లర్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం టాస్క్ఫోర్స్ అధికారులు గాలిస్తున్నారు. ఘటన స్థలి నుంచి 50 ఎర్రచందనం దుంగలు, ఆటో, ద్విచక్ర వాహనం, మినీ లారీతో పాటు నిత్యావసర సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.