YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహిళా న్యాయవాదిగా మల్హోత్రా చరిత్ర

 మహిళా న్యాయవాదిగా  మల్హోత్రా  చరిత్ర

 

ఓ మహిళా న్యాయవాదికి నేరుగా భారతదేశపు అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి అయ్యే అవకాశం లభించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు చరిత్రలో ఇదో అరుదైన ఘట్టంగా మిగిలిపోతుంది. ఈ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వివరాలు... సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న జడ్జిల స్థానాలను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. అందులో ఒకరు, ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కేఎం జోసెఫ్. మరొకరు మహిళా సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా.

వీరిద్దరినీ న్యాయమూర్తులుగా నియమించే నిమిత్తం అంగీకారం కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వీరి పేర్లను కొలీజియం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. కేంద్రం ఆమోదం కనుక లభిస్తే ఓ మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి అయిన తొలి వ్యక్తిగా ఇందుమల్హోత్రా చరిత్ర సృష్టిస్తారు.

కాగా, 1989లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఫాతిమా బీవిని నియమించారు. ఆ తర్వాత జస్టిస్ సుజాత వి. మనోహర్, జస్టిస్ రుమా పాల్, జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ మహిళా న్యాయమూర్తులుగా పని చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్. భానుమతి ఉన్నారు. కేంద్రం ఆమోదిస్తే సుప్రీంకోర్టుకు ఎంపికైన ఏడో మహిళా న్యాయమూర్తి ఇందు మల్హోత్రా అవుతారు.  

Related Posts