
నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పురానాపూల్ నుంచి లంగర్‌హౌస్ వెళ్లే రోడ్డు పక్కనే ఓ మహిళను ఆగంతకులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు ఓ బైక్ పై వచ్చి మహిళను హత్య చేసి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గురైన మహిళ వివరాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు