YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జీవితంలో ప్రతి మనిషికి ముగింపు ఉంది - జస్టిస్ నాగార్జున రెడ్డి

జీవితంలో ప్రతి మనిషికి ముగింపు ఉంది - జస్టిస్ నాగార్జున రెడ్డి
జీవితం అశాశ్వతం అని జీవితంలో ప్రతి మనిషికి ముగింపు అనేది ఉంటుందని న్యాయమూర్తిగా నాకు రెండు రోజుల్లో ముగింపు వస్తుందని హైకోర్టు జస్టిస్ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు శనివారం కడప బార్ అసోసియేషన్ లో జరిగిన సన్మాన కార్యక్రమం లో నాగార్జున రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా హైకోర్టులో విధులను నిర్వహించాలని ఎన్నో సంతృప్తికరమైన తీర్పులను ఇవ్వడం జరిగిందన్నారు ప్రధానంగా పుట్టిన గడ్డ అయినా కడపకు ఎంతో సేవ చేశారని అయినా ఇంకా చేయాల్సి ఉందన్నారు కోర్టు పరిపాలన వ్యవహారాలలో  కొంత పక్షపాతం చూపించడం జరిగిందని అది ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు సమస్యలను పరిష్కరించడంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు నా మనవరాలు వేమన పద్యం వేమన పద్యం చదువుతూ గంగిగోవు పాలు గరిటడైన చాలు కడివెడైన నేమి ఖరము పాలు అన్నట్లుగా తను పాడిన ఆ పద్యం నన్ను ఎంతో ఆలోచింప చేసింది అన్నారు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తూ అంతరాత్మ నో సంతృప్తి పరుస్తూ వచ్చానన్నారు పుట్టిన ఈ జిల్లాకు ఎంత చేసినా తక్కువే అవుతుందన్నారు పోర్ట్ఫోలియో జడ్జి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున రెడ్డి జస్టిస్ గా ఎన్నో విలువైన సేవలు అందించారని ఆయన సేవలు మరువలేనివన్నారు ఆయన పరుచూరి రంగారావు కేసులో కూడా మంచి తీర్పును ఇవ్వడం జరిగిందన్నారు అలాగే లీగల్ సర్వీసెస్ కేసు మిగతా తీర్పుల విషయంలో కూడా బాధితులకు న్యాయం జరిగే విధంగా ఇవ్వడం జరిగిందన్నారు ఒక మంచి వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నది ఆయన వెనుక ఆయన భార్య శోభ భర్తకు అనుకూలంగా ఉంటూ ఆయన విజయాల్లో కీలకపాత్ర పోషించారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రమణ్యం మాట్లాడుతూ నాగార్జున రెడ్డి 2006లో హైకోర్టు జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశారు 2008లో పర్మనెంట్ జడ్జి గా బాధ్యతలు స్వీకరించారు అన్నారు కడప కోర్టు క్యాంపస్ అభివృద్ధికి ఆయన సహకారం మరువలేనిదన్నారు సెక్షన్-2 ప్రకారం ఇచ్చిన తీర్పు లు చుక్కల భూములు సెటిల్మెంట్ ల్యాండ్ లో ఆర్ ఎస్ ఆర్ లో సమస్యలు పరిష్కారానికి న్యాయబద్ధమైన తీర్పులను అందించారన్నారు 266 పెండింగ్ కేసులలో కూడా ఆయన తీర్పులను ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఆరో అదనపు న్యాయమూర్తి మంజరి నాలుగోవ అదనపు న్యాయమూర్తి చక్రపాణి సబ్ జడ్జి సి ఎన్ మూర్తి డి ఎల్ ఎస్ ఏ జడ్జి ప్రవీణ్ కుమార్ ఎక్సైజ్ జడ్జి అశోక్ ఇతర న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయవాద గుమస్తాల పాల్గొన్నారు

Related Posts