ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్‌లు దంపతులు అయ్యారు జోధ్‌పూర్‌లోని చారిత్రక ఉమైద్ భవన్ ప్యాలెస్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆహూతుల సాక్షిగా, కోటి ఆశలతో ప్రియాంక, నిక్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శనివారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వారి పెళ్లి వేడుక సందడిగా సాగింది. ఈ వేడుకలో పెళ్లికూతురు ప్రియాంక డిజైనర్ రాల్ఫ్ లారెన్ రూపొందించిన గౌనులో కళకళలాడగా, పెళ్లికొడుకు నిక్ కూడా అదే డిజైనర్ రూపొందించిన ఊదా రంగు సూట్‌లో మెరిసిపోయారు. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ చొపార్డ్‌కు చెందిన వెడ్డింగ్ బ్యాండ్స్‌ను వధూవరులిద్దరూ పరస్పరం మార్చుకున్నారు. కాగా నేడు ప్రియాంక, నిక్‌లు హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకోనున్నారు. ‘‘పరస్పర విశ్వాసాలను, సంస్కృతులను గౌరవించే రెండు కటుంబాలను ఒక్కటి చేసే గొప్ప అవకాశాన్ని మాకు మా ప్రేమబంధం అందించింది. ఆ స్ఫూర్తితోనే మేం మా బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్తున్నామ’’ని పోస్ట్ చేసింది ప్రియాంక.