జనసేన పార్టీ ధికార ప్రతినిధి విజయబాబు రాజీనామా చేశారు. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న విజయబాబు రాజీనామా పార్టీ వర్గాల్లో కలకలానికి కారణమైంది. తన వ్యక్తిగత కారణాల వల్లే పార్టీని వీడుతున్నట్లు విజయబాబు ప్రకటించారు. ఒకటి రెండు రోజులు ఆగితేగాని అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.