YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ టెన్త్ పరీక్ష షెడ్యూల్ విడుదల

 ఏపీ టెన్త్ పరీక్ష షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలకు ఈ నెల 7లోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. విజయవాడలో సోమవారం జరిగిన ఒక  సమావేశంలో ఆయన పదో తరగతి పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మొత్తం 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.  2019 మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని గంటా తెలిపారు.  91 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించామన్నారు.  ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా భద్రతను పెంచడంతో పాటు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పరీక్షల నిర్వహణ పూర్తయ్యాక నెల రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపియింగ్ వంటి ఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈసారి పరీక్షలకు 159 ఫ్లైయింగ్ స్క్వాడ్ లను సిద్దం చేశాం. ఆన్ లైన్ లో ద్వారా దరఖాస్తు లు స్వీకరిస్తాం. వెబ్ సైట్ నుంచే హాల్ టిక్కెట్ లు డౌన్ లోడ్ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు వుంటుంది, అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని అన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని పరీక్ష కేంద్రాలలో బల్లల మీద కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశాం. విద్య పరంగా 2014 లో మన రాష్ట్రం 17వ స్థానంలో ఉండేది.. ఇప్పుడు ఎపి మూడో స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాక, ఉత్తీర్ణత శాతం పెంచాం. విద్యా రంగానికి ఈ ప్రభుత్వం 25వేల కోట్లు కేటాయించింది. విద్యార్థులలో నైపుణ్యం గుర్తించి వారికి ప్రతిభ అవార్డులు అందచేస్తున్నామని అయన అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఈ సందర్బంగా మంత్రి పేర్కోన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామన్నారు. 

Related Posts