కల్యాణ్ రామ్ కి చెప్పుకోదగిన సక్సెస్ లేదు. తాజాగా అయన కే.వీ గుహన్ వినిపించిన కథ నచ్చడంతో, ఆయనతో సినిమా చేశాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమైంది. రీసెంట్ గా ఈ సినిమాకి '118' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ టైటిల్ లోగోను ఈ రోజున రిలీజ్ చేశారు. సినిమాపై కుతూహలాన్ని పెంచేలా ఈ టైటిల్ లోగోను డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కథానాయికలుగా నివేదా థామస్ .. షాలిని పాండే నటించారు.