అయ్యప్ప మాలాధారుల రద్దీ దృష్ట్యా డిసెంబర్, జనవరి నెలల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ మీదగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్–కొల్లాం–హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలు హైదరాబాద్(07141) నుంచి డిసెంబర్ 12, 16 జనవరి 2, 5, 8, 9, 14 తేదీల్లో సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుతుంది. తిరిగి కొల్లాం(07142) డిసెంబర్ 14, 18 జనవరి 4, 7, 10, 11, 14, 16 తేదీల్లో తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి మరోసటి రోజు ఉదయం 10.35 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది. ఈ రైలు బేగంపేట, లింగంపల్లి, వికరాబాద్, తాండూరు, యద్గిర్, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, సేలం, ఈరోడ్, తిరూపూర్, కోయంబత్తూరు, పలక్కడ్, త్రిసూర్, అలువ, అరక్కోణం, కోట్టాయం, చెంగన్నూర్, కాయన్‌కులం మీదగా కొల్లారు రాకపోకలు సాగిస్తుంది. అదిలాబాద్–కొల్లాం (రైలు నం:07509) రైలు డిసెంబర్ 28న మధ్యాహ్నం 1.25 గంటలకు బయలుదేరి 30వ తేదీ ఉదయం 4.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు సహస్రకుండ్, హిమయత్‌నగర్, ధర్మబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, తిరుపతి, కాట్పాడి, సేలం, కోయంబత్తూరు మీదగా కొల్లాం చేరుకుంటుంది.