లెజండరీ దర్శకుడు బాల చందర్ 2014లో మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 100 సినిమాలకి పైగా దర్శకత్వం వహించిన బాల చందర్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. బాలచందర్‌ని రజనీకాంత్, కమల్ హాసన్‌లు తమ గురువుగా చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌లో బాలచందర్ ఆస్తులు వేలం వేయబోతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. దీనిపై బాల చందర్ నిర్మాణ సంస్థ కవితాలయ మూవీస్ ప్రకటన విడుదల చేసింది. వ్యాపారంలో భాగంగా బాలచందర్ తన ఇళ్ళు, ఆఫీస్ డాక్యుమెంట్స్‌ని చెన్నైలోని యూకో బ్యాంక్‌లో పెట్టి రుణం తీసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత రుణానికి సంబంధించిన వడ్డీ పెరుగుకుంటూ వచ్చింది. దీంతో 1.36 కోట్లకి వేలం వేయాలని బ్యాంక్ నిర్ణయించింది. కాని ఇప్పటికే తీసుకున్న మనీకి సంబంధించి చాలా వరకు రుణాన్ని తిరిగి చెల్లించాం. ఇక మిగిలిన వడ్డీని ఒకేసారి చెల్లించేలా మా ప్రతినిధులు బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నారు. బాలచందర్ ఆస్తులు వేలం జరగకుండా ప్రయత్నిస్తున్నాం అని కవితాలయ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే బ్యాంక్ మాత్రం బాలచందర్ ఇల్లుతో పాటు ఆఫీసుని వేలం వేస్తున్నట్టుగా చెబుతుంది. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి తాము ఏం చెప్పలేమని బ్యాంకు అధికారులు అంటున్నారు. మరి ఈ విషయంలో బాలచందర్ శిష్యలుగా చెప్పుకుంటున్న రజనీకాంత్, కమల్ హాసన్‌లు ఏమైన జోక్యం చేసుకుంటారా లేదా అనేది చూడాలి.