YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ పై దాడి కేసు ఏపీ సర్కార్ కు కోర్టు నోటీసులు

జగన్ పై దాడి కేసు ఏపీ సర్కార్ కు కోర్టు నోటీసులు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మెహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన దాడికి సంబంధించిన కేసును హైకోర్టు సోమవారం విచారించింది. ఎయిర్పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ఎందుకు అప్పగించలేదని నిలదీసింది. ఈ కేసును ఎన్ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో చెప్పాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.  
వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసును ఏపీ పోలీసుల పరిధి నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసేలా ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక పిల్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.  ఆకేసులో హైకోర్టు సోమవారం ఇరు వర్గాల వాదనలను విన్నది. ఎమ్మెల్యే  తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి కావాలనే ఏపీ ప్రభుత్వం విచారణను తమ పరిధిలో సాగిస్తుందని కోర్టుకు విన్నవించారు.   రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. ఎన్ఐఏ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఎయిర్ పోర్ట్ లేదా, ఎయిర్ క్రాఫ్ట్ లో అఫెన్స్ జరిగితే విచారణ ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందన్నారు. అన్ లా ఫుల్ అగనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఎవియేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 3(ఏ)కింద కేసు నమోదు చేయాలని అందుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, జగన్ తరపు న్యాయవాది వాదననను ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఖండించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపుతోందన్నారు.  ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం,  కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Related Posts