వచ్చే ఎన్నికలలో కలూరు నియోజకవ్గం నుండి పోటిచేయనని మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పష్టం చేసారు. సోమవారం అయన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసారు. ఆ నేపధ్యంలో అయన మాట్లాడుతూ పార్టీ అదిష్టానం చెప్పినా సున్నితంగా తిరస్కరిస్తానని అన్నారు. అయితే, తానుబీజేపీలోనే కొనసాగుతానని అన్నారు. గత కొద్దిరోజులుగా అయన పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. ఆ ఉహాగానాలకు తెరదించుతూ అయన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ జిల్లా బిజెపి అధ్యక్షుడు కుమారస్వామి సమక్షంలో ప్రకటన చేసారు.