YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆరున్నర కోట్లకు రోల్స్ రాయిస్

ఆరున్నర కోట్లకు రోల్స్ రాయిస్
భారత్‌లోనూ క్రమంగా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలన్నీ మన దేశ మార్కెట్‌‌ను దృష్టిలో పెట్టుకొని... కొత్త మోడల్ కార్లను భారత విపణిలోకి ప్రవేశపెడుతున్నాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల ఉత్పత్తుల సంస్థ 'రోల్స్‌ రాయిస్‌' సరికొత్త మోడల్‌ కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ‘రోల్స్‌ రాయిస్‌ కలినన్‌ ఎస్‌యూవీ’ పేరుతో ఈ కొత్త కారును తీసుకొచ్చింది. అయితే.. విలాసవంతమైన ఈ కారు ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఈ కారు ధర ఢిల్లీ ఎక్స్ షోరూంలో అక్షరాలా 6.95 కోట్లు. అయితే బుకింగ్స్‌కు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడికాలేదు. 
✪ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వజ్రంగా పేరొందిన 'కలినన్‌' పేరు మీద ఈ కారును తీసుకురావడం విశేషం. 
✪ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'ఎస్‌యూవీ' కూడా ఇదేనని సంస్థ పేర్కొంటుంది. 
✪ అన్నిరకాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ కొత్త ఎస్‌యూవీ కారుని రూపొందించారు. 
✪ కారులోని ‘ఎవ్రీవేర్’ మోడ్‌ ఆప్షన్‌ ద్వారా ఎలాంటి రోడ్లపై అయినా.. ఈ కారును సౌకర్యవంతంగా నడపవచ్చు

Related Posts