కన్నడ బ్యూటీ రష్మిక అందం, అదృష్టం, అభినయం పుష్కలంగా ఉన్న కథానాయికల్లో ఒకరు. అందుకే ఆమె కోసం ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన “డియర్ కామ్రేడ్” చిత్రంలో నటిస్తున్న రష్మిక.. కన్నడలో రెండు సినిమాలతో యమ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమెకు టాలీవుడ్ మరో అదృష్టం డోర్ బెల్ కొట్టింది. అదేంటో ఈ స్టోరీలో చూసేయండి“ఛలో” చిత్రంతో తెరకు పరిచయమైన ఈ అమ్మడు అందంతో కాకుండా క్యూట్ నెస్ తో ఆకట్టుకొంది. తొలి చిత్రంతోనే అభిమానుల్ని సంపాదించుకొన్న ఈ క్యూట్ హీరోయిన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. రష్మికకి ఇప్పుడు వచ్చిన ఆఫర్ అలాంటిలాంటి ఆఫర్ కాదు.. మెగా ఫ్యామిలీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ యంగ్ హీరో అయిన వరుణ్ తేజ్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకొందని సమాచారం. తమిళ సూపర్ హిట్ చిత్రం “జీగార్తాండ”ను హరీష్ శంకర్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తమిళనాట లక్ష్మీ మీనన్ పోషించిన పాత్రను రష్మిక చేయనుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ డైరెక్టర్ గా నటించనున్న ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ఇంకా తెలియరాలేదు. తొలుత ఈ చిత్రంలో వరుణ్ గ్యాంగ్ స్టర్ రోల్ పోషించనున్నాడు అని వార్తలొచ్చినప్పటికీ.. సిద్ధార్థ్ పాత్రను రిప్రైజ్ చేస్తున్నాడని కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఆఫర్ గనుక రష్మికకు కన్ఫర్మ్ అయ్యిందంటే.. మెగా కాంపౌండ్ లో ఆల్రెడీ అడుగుపెట్టిన ఈ సుందరి అక్కడ సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకోవడం ఖాయం. అయితే తమిళ్ రష్మిక, విజయ్ కి జోడిగా నటిస్తుందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ‘సర్కార్’ సినిమా మంచి విజయం సాధించగా హీరో విజయ్ నెక్స్ట్ అట్లీ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక కన్ఫర్మ్ అయిందంటూ గతంలో వార్తలు రావడంతో నా అంచనాలు పెంచకండిరా అంటూ ఫన్నీ గా రిప్లై ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే రూమర్ బయటికి రావడంతో విజయ్ సార్, అట్లీ సార్ సినిమాలో నేను నటుస్తున్నానా అని చాలామంది అడుగుతున్నారు, ఈసారికి అది కుదరలేదు, ఫ్యూచర్ లో వారితో కలసి పనిచేసే అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను. మీరు నామీద చూపిస్తున్న ప్రేమకి చాలా థాంక్స్, త్వరలోనే తమిళ్ సినిమాలో తప్పకుండ ఎంట్రీ ఇస్తాను అంటూ క్లారిటీగా చెప్పేసింది. మరి ఈ క్రేజీ బ్యూటీకి మున్ముందు ఇంకెన్ని క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.