కెరీర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలో యంగ్ హీరో శర్వానంద్ ను చూసి నేర్చుకోవాలి. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించిన శర్వా..విభిన్న స్రిప్ట్ లు ఎంచుకుంటూ హీరోగా తనకంటూ సపరేట్ మార్కేట్ క్రియేట్ చేసుకున్నాడు. సుమారు ఏడాదిపైగా గ్యాప్ తో వస్తున్న శర్వానంద్ కొత్త సినిమా పడి పడి లేచే మనసు డిసెంబర్ 21 విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ వేగాన్ని పెంచిన టీం తాజాగా ఓ లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది. కల్లోలం అంటూ సాగే ఈ పాటను కృష్ణ కాంత్ రాయగా విశాల్ చంద్రశేఖర్ ట్యూన్ కంపోజ్ చేసాడు. అనురాగ్ కులకర్ణి గాత్రం మంచి ఫీల్ తో ఉంది. ఇక పాట విషయానికి వస్తే థీమ్ ని విజువల్స్ లో చూపించే ప్రయత్నం ఇందులో చేసారు. మెడికో స్టూడెంట్ అయిన సాయి పల్లవిని చూసిన శర్వా తనను ఎంత ఇష్టపడ్డాడో మాటల్లో వర్ణిస్తూ తన లాంటి దేవకన్య ట్రైన్ లో ప్రయాణించడం గురించి గమ్మత్తైన పదాలతో వర్ణించడం ఆకట్టుకుంటుంది. ట్రైన్ లో నుంచి అమాయక చూపులతో సాయి పల్లవి శర్వాను చూడటం బైక్ మీద స్టైలిష్ గా శర్వా తననే తలుచుకుంటూ ఊహల్లోకి వెళ్ళడం కాన్సెప్ట్ మొత్తం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. మొత్తానికి ఆడియో అంచనాలు పెంచేలా ఉండటం విశేషం. ఇప్పటికే శర్వానంద్ సాయి పల్లవి ఫ్రెష్ కెమిస్ట్రీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇంతకు ముందే విడుదలైన టీజర్ తో పాటు మరో ఆడియో సింగల్ కూడా ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడీ పాట కూడా వాటికి మించేలా అనిపించడం విశేషం. విడుదలకు మూడు వారాల కంటే తక్కువ వ్యవధి ఉన్న నేపధ్యంలో త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ లాంచ్ కూడా చేయబోతున్నారు. అందాల రాక్షసి-కృష్ణగారి వీర ప్రేమ గాథ లాంటి టిపికల్ లవ్ స్టోరీస్ తో మెప్పించిన దర్శకుడు హను రాఘవపూడి దీన్ని కూడా అదే విధంగా తీర్చిదిద్దినట్టు సమాచారం. మహానుభావుడు తర్వాత శర్వానంద్.. ఏంసిఏ తర్వాత సాయి పల్లవి చేస్తున్న మూవీ ఇదే కావడంతో వీరిద్దరి హిట్ కన్ఫార్మ్ అంటూ ఇండష్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీ ఆడియెన్స్ మనసును చూరగుంటుందో, లేదో చూడాలి