YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొనసాగుతున్న ఏయూ సిబ్బంది నిరసనలు

కొనసాగుతున్న ఏయూ సిబ్బంది నిరసనలు
 ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 28 రోజులు, టైం స్కేల్ ఉద్యోగులకు శాస్వత ఉద్యోగ బధ్రత కల్పించాలని కోరుతూ ఉద్యోగులు చేస్తున్న నిరసనలు, దీక్షలు సోమవారం కుడా కొనసాగాయి. పెద్దసంఖ్యలో ఉద్యోగులు పాల్గొని తమ న్యాయబద్ధమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరారు. ఏయూ పరిపాలనా భవనం ఎదురుగా ఏయూజేఏసి అద్యక్షుడు డాక్టర్ జి రవికుమార్ అధ్వర్యంలో ఉద్యోగులంతా ధర్నలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెకు దిగుతీమన్నారు. వర్సిటీ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కనీస వేతనాలు అందించాలన్నారు. ఈ దిశగా పాలకులు పనిచేయాలన్నిరు. ఆర్గనైజంగ్ సెక్రటరీ ఇ.లక్ష్మణ రావు, జాయింట్ సెక్రటరీలు ఎస్.కె ఫరీద్ లు మాట్లాడుతూ సమస్య పరిష్కరించని పక్షంలో ఉద్యోమం తీవ్రతరం చేస్తామన్నారు. జేఏసీ చైర్మన్ ఆచార్య జాలాది రవి మాట్లాడుతూ వర్సిటీ ఉన్నతాధికారులు వెంటనే ఉద్యోగుల సమస్యల పై స్పందించాలని కోరారు. ఉపాద్యక్షుడు ఆచార్య డి.వి రామకోటి రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అధికారుకలకు ఉద్యోగుల  సమస్యలు పట్టడం లేదన్నారు.
పలువురు సంఘీభావం…
జేఏసీ దీక్ష శిభిరాన్ని తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు సందర్శించారు. ఉద్యోగులకు తన సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, త్వరలో సానుకూల నిర్ణయం వచ్చే విధంగా కృషిచేస్తానన్నారు. ఆ నెల 5 వ తేదీలోగా సమస్య పరిష్కారానికి  పనిచేస్తున్నానన్నారు.  వైఎస్ ఆర్ సిపి విశాఖ పార్లమెంట్ అద్యక్షుడు తైనాల విజయ్ కుమార్ కుడా దీక్ష శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఉద్యోగుల డిమాండ్లను మానవతా దృక్పధంతో పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి కె. అప్పారావు, ఆర్గనైజంగ్ సెక్రటరీ ఇ.లక్ష్మణ రావు, వర్కింగ్ సెక్రటరీ సి.హెచ్.ఎన్ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ ఎస్.కె ఫరీద్, మొల్లి అప్పలరాజు తదితరులు ప్రసంగించారు.

Related Posts