కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగే ' జ్ఞానభేరి ' కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. విద్యార్థుల్లో ప్రేరణ, ఆత్మవిశ్వాసాన్ని, ప్రపంచ పోటీతత్వాన్ని పెంచి నవ్య ఆలోచనలకు నాంది పలికేలా యోగివేమన విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర ్యంలో జ్ఞానభేరి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. జిల్లాలోని వైవీయూ కళాశాల, విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలు, ఇంజినీరింగు, వెటర్నరి, పశు సంవర్ధక, పాలిటెక్నిక్ తదితర కళాశాలల నుంచి 22,274 మంది విద్యార్థులు, 1,647 మంది బోధనా సిబ్బంది మొత్తం కలిపి 23,923 మంది జ్ఞానభేరి యాప్లో పేర్లు నమోదు చేసుకున్నారు. | మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం వైవీయూలోని జ్ఞాబేరి నసభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టరు హరికిరణ్ స్వీయ పర్య వేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిం చి కలెక్టరు మార్గదర్శకం చేశారు. వైవీయూ వీసీ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి, కులసచివులు ఆచార్య చంద్రయ్య ఏర్పాట్లును పరిశీలించారు. జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి సభా ప్రాంగణాన్ని సందర్శించారు. పొలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు చేశారు. విద్యార్థులు జ్ఞానభేరి కార్యక్రమా నీకి హాజరవడానికి, కార్యక్రమం పూర్తవ్వగానే వెళ్లడానికి అనువైన రహదారులు ఏర్పాటు చేశారు. యాప్ ఏ -్వరా దిగుమతి చేసుకున్న బార్ కోడ్ పత్రాన్ని వారి వద్ద ఉన్న పరికరం ద్వారా గుర్తించి, తనిఖీ చేసి ప్రాంగ ణం లోనికి పంపుతారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేస్తున్నారు. విశ్వవిద్యాలయా నికి అయిదు కిలోమీటర్ల దూరం నుంచే రహదారులకిరువైపుల పొలీసులు ఉంటూ పరిశీలన చేశారు. దా దాపు వెయ్యిమంది పోలీసులు బందోబస్తు విధుల్లో సిద్దంగా ఉన్నారు. ముఖ్యమంత్రి సందర్శించే స్టాల్స్, 25వేల మంది కూర్చొనేలా విశాలమైన వేదిక ప్రాంగణం, చుట్టూ ఎల్సీడీ సీన్లు, ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా పోలీసుల స్వాధీన లోకి తీసుకున్నారు. ప్రతి ప్రాంతాన్ని జల్లెడపట్టారు. అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.