YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రధాన పార్టీలను భయపెడుతున్న బీఎస్పీ

ప్రధాన పార్టీలను భయపెడుతున్న బీఎస్పీ

ఎన్నికల్లో అధికార పీఠం కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన కూటమి, టీఆర్‌ఎస్, బీజేపీలు హోరాహోరీ తలప డుతున్నాయి. విజయమే దిశగా ఓటర్లను తమవైపు తిప్పుకు నేందుకు మద్యం, నగదు ఎర వేస్తూ ప్రచారంలో దూసుకపో తున్నాయి. అంతటితో ఆగకుండా స్టార్ క్యాంపెయినర్లను ప్రచారానికి దింపి  భారీ బహిరంగ సభలు లక్ష లాదిమంది తరలిస్తున్నారు. ఈరెండు పార్టీల్లో పనిచేసి సీటు ఆశించిన నాయకులకు టికెట్లు దక్కకపోవడంతో అధిష్టానంపై కన్నెర్ర చేసి జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన బహాజన సమాజ్ పార్టీ జెండా పట్టారు. ఆపార్టీ తరుపున పోటీ చేసి ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. ఏనుగు గుర్తుతో సత్తా చాటుతామని ఇంటింటి ప్రచారం చేస్తూ ముందువరసలో  నిలుస్తున్నారు. 8నుంచి 10మంది అభ్యర్థులు గెలుపు అంచుల్లోకి చేరుకున్నారు. ప్రధానంగా మేడ్చల్ నుంచి పోటీలో ఉన్న నక్కా ప్రభాకర్‌గౌడ్ ఊహించని విధంగా విపక్ష పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. గతంలో టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలో పనిచేశారు. అక్కడ కూడా ఆయనకు టికెట్ వచ్చినట్లే వచ్చి రెండుపర్యాయాలు చేజారిం ది.ఈసారి బరిలో ఉండకుంటే రాజకీయంగా వెనకపడాల్సివస్తుందని ఖచ్చితంగా రంగంలో ఉండాలని భావించి బీఎస్పీ తరుపున నిలబడ్డారు. ఆయనకు రోజురోజుకు జనాదరణ పెరిగిపోతుండటంతో పెద్దపార్టీల నాయకులు తలపట్టుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి పురుడుపోసిన నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం నుంచి మలిదశ ఉద్యమనాయకారులు బెల్లి లలిత సోదరుడు బెల్లి కృష్ణయాదవ్ రేసులో ఉండి, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కుబేరు లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గం ఓట్లు 39వేలకుపైగా ఉండటంతో వారంతా ఆయనకు మద్దతు పలికేందుకు సిద్దమైయ్యా రు. తెలంగాణ  ఉద్యమంలో ముందున్న కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నేతలు తాము సైతమం టూ బెల్లి కుటుంబానికి అండగా నిలిచారు. అమరుల కుటుంబాల తరుపున అసెంబ్లీకి పంపిస్తామని అక్కడ ప్రజలు హామీ ఇస్తున్నారు. షాద్‌నగర్‌లో వీరపల్లి శంకర్ తనదైన శైలిలో ప్రచారంలో ముందున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పనిచేశారు. అక్కడ టికెట్ రాకపోవడంతో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఉండటంతో నిరాశ మిగిలింది. ఎలాగైనా పోటీ చేయాలనే కోరికతో బీఎస్పీ నుంచి బరిలో దిగి ప్రత్యర్థులను వెంటాడుతున్నారు. ఖైరతాబాద్‌లో మన్నెం గోవర్ధన్‌రెడ్డి దూసుకెళ్లుతున్నారు. ఇక్కడ చతుర్మఖ పోటీ ఉండటంతో తాను తక్కువ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూకట్‌పల్లి బరిలో పన్నాల హారీష్‌రెడ్డి రేసులో ఉండి టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు సవాల్ విసురుతున్నారు. తనదే గెలుపం టూ నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. దేవరకొండ నియోజ కవర్గంలో కూటమి తరుపున  సీటు ఆశించిన బిల్యానాయక్ చివరి నిమిషంలో రాకపోవడంతో ఆయన కూడా బీఎస్పీ గడప తొక్కి పోటీలో నిలిచి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు కొరకరా ని కొయ్యగా మారారు. ఇబ్రహీం పట్నంలో మాజీ శాసనసభ్యు లు కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు మల్‌రెడ్డి రంగారెడ్డి కూడ మాయావతి పార్టీకి జైకొట్టారు. సొంత పార్టీ నుంచి టికె ట్ దక్కకపోవడంతో ఏనుగు గుర్తుపై బరిలో నిలిచారు. అక్కడ నుంచి బరిలో ఉన్న మంచిరెడ్డి, సామరంగారెడ్డి ఆయన ప్రచా రానికి తట్టుకోలేక పోతున్నారు.వేలాదిమంది ఆయనకు నీరాజ నాలు పలుకుతుండటంతో గెలుపుపై వారు లెక్కలు వేసుకుం టున్నారు. సూర్యాపేటలో బొల్కం వెంకట్ యాదవ్ జోరుగా ప్రచారంలో పరుగులు పెడుతున్నారు. దళిత బహాజన వర్గాల ప్రజలు ఆదరణ చూపడంతో గెలుపునాదేనంటున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు మంత్రి జగదీష్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, సంకినేని వంటి నాయకులు తమ ఓటు బ్యాంకు చీల్చిపోతుందని మధపడుతున్నారు. మునుగోడులో మాల్గ యాదయ్య తనదే విజయమంటూ ఉదృత్తంగా ప్రచారం నిర్వ హిస్తున్నారు. సమీప నాయకులు రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలను వణికిస్తున్నారు. గడిచిన రెండు పర్యాయాల ఎన్నికల్లో బీఎస్పీ అంతంత ప్రభావం చూపిన ఈఎన్నికల్లో మాత్రం ప్రధాన పార్టీ నాయకుల వెన్నులో చలి మంటలు రేపుతుంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts