YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు పది నాలుకలున్నాయి

చంద్రబాబుకు పది నాలుకలున్నాయి
తెలంగాణా ఎన్నికలకు చంద్రబాబు 1200 కోట్లు తరలించారు. తెలుగుదేశం -కాంగ్రెస్ పార్టీల డీల్ ఏమిటో ప్రజలు తెలుసుకోవాలి. కాంగ్రెస్ ప్రకటనల్లో చంద్రబాబు ఫోటోలు పెద్దవిగా కనిపిస్తున్నాయని వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. రాజస్దాన్ .మధ్యప్రదేశ్ ఎన్నికలకు 500 కోట్ల రూపాయలు చంద్రబాబు పంపారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాహుల్ గాంధికి ఐదు వేల కోట్లు చంద్రబాబు ఇస్తానన్నారు. ఏపిలో దోచిన డబ్బంతా ఎన్నికలలో ఖర్చుపెడుతున్నారు. ఒక్కో ఓటుకు ఐదువేల రూపాయలు ఇస్తామని నంద్యాల ఎన్నికల్లో చెప్పారు. ఏ రోజు ఆ డబ్బు ఎక్కడకు ఎలా  తరలిస్తారు అని నేను మీకు ప్రజలందరికి చెప్తాను.దీనివెనక ఉన్నవారు ఎవరంటే, పప్పునాయుడుతో ఉన్న రాజేష్ ,శ్రీనివాస్ ,అజ్ఞాత వ్యక్తి గోపి,యరపతినేని శ్రీనివాసరావు,సుబ్బారావులు. కలసి ఎలా తరలించబోతున్నారో సమయం వచ్చినప్పడు చెప్తానని అన్నారు. ప్రజలారా అది మీ సొమ్ము మీరు ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. చంద్రబాబుకు రెండుకాదు పదినాలుకలు ఉన్నాయి.రావణసురుడుకి పదితలల్లా ఈయనకు పది నాలుకలు ఉన్నాయి.  అవినీతిలో హిమలయాల అంచులకు వెళ్లారని విమర్శంచారు.  టెండర్లకు సంబంధించి ఏకంగా నలభై శాతం రేటు ఫిక్స్ చేసిన దుర్మార్గ ముఖ్యమంత్రి చంద్రబాబు. నేను నీతిమంతుడ్ని, నాకంటే సీనియర్ లేడు భారతరాజకీయాలలో అని గొప్పలు చెప్తాడు. ఎలాంటి  పరిస్దితులలోనైనా డబ్బు ఖర్చు పెట్టి తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నాడు. తన సొంత ఎంఎల్ ఏలు టిఆర్ ఎస్ లోకి వెళ్లారని చంద్రబాబు అక్కడకు వెళ్లి వారంతా ద్రోహులని అంటారు. మరి ఆయనేమో ఇక్కడ 23 మంది వైయస్సార్ కాంగ్రెస్ ఎంఎల్ ఏలను కొన్నసంగతి గురించి చెప్పడు. నా మీద న్యాయపరమైన చర్యలు కాకుండా క్రిమినల్ చర్యలకు కూడా చంద్రబాబు పాల్పడతాడు అని నా హితులు చెప్పారు. ప్రజలనుంచి దోచుకున్న సొమ్మును ఎన్నికలలో ఖర్చు పెట్టకుండా చూస్తాం.దానిని సరైన తీరులో ఎదుర్కొంటామని అన్నారు. అవినీతిపరులందరూ కూడా కాంగ్రెస్ పంచన చేరతారని 2013 లో చంద్రబాబు ప్రకటించారు. నేడు చంద్రబాబు దాన్ని నిజం చేస్తూ ఆయనే కాంగ్రెస్ పంచన చేరాడు.  ఈ నిప్పునాయుడు,తుప్పునాయుడు ఇప్పుడు రాహుల్ పంచన చేరాడు. ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులను తృణప్రాయంగా వదిలివేశారు. టిడిపి ఎంపీలు గబ్బిలాల్లా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని అన్నారు.  రాష్ర్టంలో పదిజిల్లాల్లో కరవు విలయతాండవం చేస్తుంటే చంద్రబాబు తెలంగాణాలో జనం రాని సభలకు హాజరవుతున్నాడు.  రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకు బుధ్ది చెప్పడానికి సిధ్దంగా ఉన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న మంచి మనస్సున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.ఆయనకు అవకాశం ఇవ్వండి. -జగన్ గారికి అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ర్టం 30 ఏళ్లపాటు సంక్షేమంలో ముందుకువెళ్తుంది. విజయవాడలోని బ్రిడ్జి కట్టలేని చంద్రబాబు హైద్రాబాద్ కట్టాడంట.శంషాబాద్ విమానాశ్రయంకట్టాడంట. ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మవద్దు. జనసేనకూడా టిడిపి వైపు మొగ్గుచూపుతోంది.  జనసేనకు ప్రజలు బుధ్ది చెప్పాలి. మాకు ప్రధాన ప్రత్యర్ది తెలుగుదేశమే. జనసేనను ఓ పెద్దపార్టీగా మేము గుర్తించడం లేదని అన్నారు. 2014 ఎన్నికలల్లో ఎలా అయితే డబ్బులు తీసుకుని కాల్ షీట్లు ఇచ్చారో  నేడు కూడా అదే విధంగా పవన్ కల్యాణ్  చంద్రబాబుకు అమ్ముడుపోతున్నారు.  ఆంధ్రరాష్ర్టంలో దళితులకు న్యాయం చేయగలిగే పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. దళితుల హక్కుల కోసం పోరాడేపార్టీ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా,విభజన హామీలు అమలు కాకపోవడానికి కారణం బిజేపి. 25 కి 25 ఎంపీలు స్దానాలు ఇవ్వండి అని శ్రీ వైయస్ జగన్ కోరుతున్నారు. తద్వారా ప్రత్యేక హోదా తెచ్చితీరతామని తెలిపారు.  తెలంగాణా ప్రజలందరూ వారి మనస్సాక్షి ప్రకారం ఎన్నికలలో ఓటు వేసుకోండి. దేశంలో ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీని ఓడించాలని నేను వ్యక్తిగతంగా చెప్తాను. తెలుగుదేశం పార్టీకి బుధ్ది చెప్పండి అని చెప్తున్నా.  చంద్రబాబువి నీచ రాజకీయాలు.  బిజేపి,  చంద్రబాబు మధ్య అవగాహన ఉంది. బిజేపికి ఈరోజు కూడా టిడిపిపై సాఫ్ట్ కార్నర్ ఉందనిపిస్తోంది.చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతున్నా  బిజేపి పట్టించుకోకపోవడమే నిదర్శనం.వారిమధ్య అనధికార అండర్ స్టాండింగ్ ఉందనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గతంలో హోదా ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదు.నేడు బిజేపి కూడా అంతే. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజి బెటర్ అని చెప్పి చంద్రబాబు తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు చేసిన ద్రోహం తరతరాలు మరచిపోవని అయన అన్నారు. 

Related Posts