అవినీతిని కప్పిపుచ్చుకొవడానికే చంద్రబాబు సిబిఐని అడ్డుకుంటున్నారు. అజయ్ కల్లామ్ ఆరోపణలపై చంద్రబాబు స్పందించాలి. ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి అన్ని లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెబితే చంద్రబాబు వివరణ ఇవ్వాలని వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేసారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. సోమిరెడ్డి లాంటి పెంపుడు జంతువుల్లాంటి వారితో కాదు మాట్లాడించాల్సింది. సోమిరెడ్డి కిరాయి రెడ్డి.ఏ కులం వారు విమర్శిస్తే అదే కులం వారితో సమాధానం చెప్పించడం చంద్రబాబు కుయుక్తి. సర్వీసులో ఉన్నప్పుడు ఎందుకు అజయ్ కల్లాం మాట్లాడలేదని సోమిరెడ్డి అంటారు. ఆ మాత్రం అవగాహన లేదా?ప్రభుత్వ సర్వీసులో ఉండగా అధికారులు మాట్లాడకూడదని అయన అన్నారు. ఇలాంటి కనీస అవగాహన లేనివారు మంత్రులుగా ఎలా ఉంటారో అర్దం కావడం లేదు. అజయ్ కల్లాం ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఆయనకు కులం ఆపాదించడం దారుణం. ఇలా మాట్లాడే సోమిరెడ్డి లాంటి వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరు. గ్రామపంచాయితీ సర్పంచ్ గా ఎన్నికయ్యే అర్హత లేని వ్యక్తికి పంచాయితీరాజ్ మంత్రి పదవిని కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఛీఫ్ సెక్రటరీలుగా పనిచేసినవ్యక్తులు చేసిన ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఎందుకుమాట్లాడటంలేదు. చంద్రబాబు అవినీతి పవన్ కల్యాణ్ కు కనిపించడం లేదా? చంద్రబాబు అవినీతి సొమ్ములో పవన్ కల్యాణ్ కు వాటా వుందాని అన్నారు. టెండర్ల మొత్తాలలో 40 శాతం మొత్తానికి కమీషన్లు పెంచిన ఘనత చంద్రబాబు,లోకేష్ లది. వ్యవసాయశాఖలో ప్రతి పనిలోను సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారు. ఇరిగేషన్ పనుల లో పనులు చేయకుండా దొంగబిల్లులు పెట్టి సోమిరెడ్డి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విధంగా 500 కోట్ల రూపాయలు దోచుకున్నారు. వైయస్ ఆర్ అదికారంలో ఉండగా ఎప్పుడైనా ఏ అధికారైనా ఏ విషయంలోనైనా వైయస్ జగన్ వత్తిడి చేస్తున్నారని చెప్పారా అని ప్రశ్నించారు. మీరు కావాలని కుట్రతో కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై శ్రీ వైయస్ జగన్ పై కేసులు బనాయించిన విషయం ప్రజలకు తెలుసు. చంద్రబాబు నీ అవినీతిపై సుమెటోగా విచారణ వేసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. లేదా చంద్రబాబు,లోకేష్ లపై వచ్చిన అవినీతిలపై కోర్టులే స్వయంగా విచారణ చేపట్టాలి. ప్రజల సొమ్ము చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ లు ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారనేది ఇద్దరు మాజీ సిఎస్ లు చెప్పడంతో బయటపడింది. వాటిని వారినుంచి కక్కించాల్సిఉందని అయన అన్నారు.