YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీల‌కు ఊర‌ట

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీల‌కు ఊర‌ట
నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ నేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌కు ఊర‌ట ల‌భించింది. సోనియా, రాహుల్‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోరాదు అని కోర్టు త‌న తీర్పులో ఆదేశించింది. కానీ 2011-12 సంవ‌త్స‌రానికి ప‌న్ను కేసును పున‌ర్ స‌మీక్షించాల‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. జ‌స్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాలు జారీ చేసింది. జ‌న‌వ‌రి 8వ తేదీన మ‌రోసారి కేసు విచార‌ణ‌కు రానున్న‌ది. అసోసియేటెడ్ జ‌ర్న‌ల్స్ లిమిటెడ్‌కు సంబంధం ఉన్న ట్యాక్స్ అసెస్‌మెంట్ కేసును మ‌ళ్లీ ప‌రిశీలించాల‌ని వేసిన పిటిష‌న్‌ను వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్ నేత‌లు కోర్టుకు వెళ్లారు. అసోసియేట్ జ‌ర్న‌ల్స్ లిమిటెడ్ నుంచి రూ.90 కోట్ల విలువైన ఆస్తుల‌ను కేవలం రూ.50ల‌క్ష‌లు చెల్లించి సోనియా, రాహుల్‌గాంధీలు యంగిండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు క‌ట్ట‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమ‌న్ దూబెతోపాటు శామ్ పిత్రోడా కూడా నిందితులుగా ఉన్నారు. ఇందులో 2015 డిసెంబ‌ర్‌లోనే సోనియా, రాహుల్‌ల‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఈ కేసు వేశారు. గ‌తంలో ప‌టియాలా హౌజ్ కోర్టు కూడా సోనియా, రాహుల్‌ల‌పై ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ విచార‌ణ‌కు ఆదేశించినా.. దానిని ఢిల్లీ హైకోర్టులో స‌వాలు చేశారు.

Related Posts