జనసేన ఆశయాలను ఇంటి, ఇంటికి తీసుకెళ్లడమే 'జనసేన తరంగం' ముఖ్య ఉద్దేశమన్నారు పవన్ కళ్యాణ్. బుధవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఫేస్‌బుక్ లైవ్‌లో రాబోతున్నట్లు చెప్పారు. బుధవారం నుంచి డిసెంబర్ 9 వరకు ఐదు రోజుల పాటూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరంగం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జన సైనికుడు.. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యువతను, జనసైనికుల్ని రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకే 'జనసేన తరంగం' ప్రారంభిస్తున్నామన్నారు పవన్. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు.. మేనిపెస్టోను ఇంటి ఇంటికి తీసుకెళ్లాలన్నారు. జన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. జనసేన ఎందుకు కొత్త తరహా రాజకీయాలు చేస్తుంది.. కులాలు, మతాల ముసుగులో రాజకీయాలు చేసే వారికి పూర్తి భిన్నంగా ఎందుకున్నామో వివరించాలన్నారు. 25 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల భవిష్యత్‌నున ఇవ్వడానికి జనసేన పనిచేస్తోందని ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు ఫేస్‌బుక్ లైవ్‌లోకి రావాలన్నారు పవన్. సైనికులు చేసే ప్రతి పనిని ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టమని సూచించారు. తాను లైవ్‌లోకి వచ్చి.. అక్కడి ప్రజలతో మమేకం అవుతానని తెలిపారు. ఐదు రోజుల పాటూ ఈ జనసేన తరంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని.. జనసైనికులు దీనిని విజయవంతం చేయాలన్నారు