వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 312వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం అంతకాపల్లి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వీఆర్ అగ‍్రహారం క్రాస్, పొగిరి, మర్రివలస క్రాస్‌కు చేరుకుంటారు. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం వైఎస్ జగన్ పాదయాత్ర ఎచ్చెర్ల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. గంగువారి సిగడాం మండలంలోని గేదెలపేట క్రాస్, మెట్టవలస క్రాస్, పలఖండ్యాం, సంతవురిటి వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. నియోజకవర్గంలో ఎత్తివేసిన ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలతో పాటు నీటి పారుదల ప్రాజెక్టులు, నగర పంచాయతీలో ఇంటిపన్నుల భారం మోపిన వైనాలను ప్రస్తావిం చారు. స్థానికంగా క్యాంపు కార్యాలయాన్ని నడుపుతున్న మంత్రి కళా వెంకటరావు చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రేగిడి ఆమదాలవలస మం డలం బూరాడ కూడలి నుంచి ప్రజాసంకల్ప యా త్రను జగన్ ప్రారంభించారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత జీఎంఆర్ నగర్, డోలపేట మీ దుగా రాజాం పట్టణానికి చేరుకుని సాయంత్రం బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం కూ డా పాదయాత్రను కొనసాగిస్తూ రాజాం మండలం అంతకాపల్లిలో యాత్రను ము గించారు