YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దైవ జనుల కోసం అంకిత భావంతో పనిచేద్దాం క్రిష్టియన్ల సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు

దైవ జనుల కోసం అంకిత భావంతో పనిచేద్దాం   క్రిష్టియన్ల సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు
దైవజనులందరి కోసం తాను అంకిత భావంతో పనిచేస్తున్నానని, క్రిష్టియన్ల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేసారు. మంగళవారంనాడు కొండపల్లిలో క్కిక్కిరిసిన మైలవరం నియోజకవర్గ క్రైస్తవుల ఆత్మీయ సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. క్రిష్టియన్ సోదరుల సమస్యలు తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఉన్నట్లు చెప్పారు. గుంటూరులో రూ.10కోట్లతో ప్రార్థనా మందిర నిర్మాణం చేపట్టారని, మరో 5కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ ఫిలిప్స్ దృష్టికి తెచ్చారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు మంత్రి ఉమా తెలిపారు. దైవజనులు జెరుసలేం వెళ్లేందుకు ప్రభుత్వం రూ.40వేలు ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు. ఫెర్రీ వద్ద క్రిష్టియన్ల కోరిక మేరకు స్థలం కేటాయింపుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చానని స్పష్టం చేసారు. ప్రతి ఒక్క దైవజనునికి ఇల్లు, ఇళ్ళ స్థలం ఇస్తానని, ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలో 12వేల ఇళ్ళ పట్టాలను సిద్ధం చేసామని, 9వేల పట్టాలు కూడా లబ్ధిదారులకు అందజేసామని తెలిపారు. అభివృద్ధి-సేవా భావం క్రిష్టియన్ల లక్ష్యం కావాలని, కుటుంబాలు అభివృద్ధి చెందితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అట్టడుగున ఉన్న కుటుంబాల వారు పిల్లలను బాగా చదివించాలని, వారని మట్టిలో మాణిక్యాలుగా గుర్తించాలని సూచించారు. డిసెంబర్ నెల యావత్ ప్రపంచం క్రీస్తు బోధనలతో, క్రిస్మస్ సంబరాలతో పునీతమౌతుందని, ఒక కుటుంబ సభ్యునిగా మీ అందరి మద్య సోదర భావాన్ని పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి ఉమా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రగతిని సహంచలేకపోతుందని, ఓర్వలేకపోతుందని ఒక పార్టీ మాత్రమే ఉండాలని, వారొక్కరిమాటే వినాలనే ధోరణిలో ఉన్నట్లు విమర్శించారు. కేంద్రంలోని బిజేపీ నుంచి ప్రమాదం కూడా ముంచుకొస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీని ప్రశ్నించే ఎకైక నాయకుడు చంద్రబాబు ఒక్కరే అని అంటూ, ప్రశ్నించే వారిని జైలుకు, ఎదిరించేవారిపై దాడులు వంటి అప్రజాస్వామిక చర్యలకు కేంద్రం ఊతమిస్తున్నట్లు ఆరోపించారు. కొండపల్లిలో రూ.1.75కోట్లతో డ్రైన్ నిర్మాణం చేస్తున్నట్లు, రూ.186కోట్లతో ఇంటింటికీ తాగునీటి పథకాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు. ప్రతి చెరువుకు, కాలువకు గోదావరి జలాలు వస్తాయని, కృష్ణా-గోదావరి నీళ్ళతో మైలవరం సస్యశ్యామలమౌతుందని తెలిపారు. పట్టిసీమతో కృష్ణాడెల్టాను కాపాడమని, వేలకోట్ల రూపాయల దిగుబడులు వచ్చాయని చెప్పారు. రూ.5వేల కోట్లతో చింతలపూడి చేపట్టినట్లు తెలిపారు. వేలాదిగా వచ్చిన దైవజనుల సమక్షంలో పలువురు దైవసేవకులు మంత్రి దేవినేని ఉమాకు మంచి జరగాలని, శుభములు కలగాలని ప్రార్థనలు చేసారు.

Related Posts