YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

కుటుంబపాలనే ఎజెండాగా పాలనగా సాగిస్తున్న కేసీఆర్‌ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌

కుటుంబపాలనే ఎజెండాగా పాలనగా సాగిస్తున్న కేసీఆర్‌              మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌
 టీడీపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రైవేటు లిమిటెడ్‌  పార్టీలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ విమర్శించారు. బీజేపీ హయాంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని, కానీ కాంగ్రెస్‌ హయాంలో ఏర్పడిన తెలంగాణ మాత్రం వెనకబడి ఉందని అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మంగళవారం సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో  ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కుటుంబపాలనే ఎజెండాగా పాలనగా సాగుతోందని దుయ్యబట్టారు..దేవుడికి ఇచ్చిన హామీలను కూడా కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 1947 ఆగస్ట్‌ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ, మరాట్వాడా ప్రాంతాలకు మాత్రం రాలేదని, నిజాం పాలన అంతంతోనే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చారని ఆయన గుర్తుచేశారు. సెప్టెంబర్‌ 17న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ విస్మరించిన హామీలను తాము అమలుచేసి తీరుతామని తెలిపారు. మహాకూటమి, టీఆర్‌ఎస్‌ పార్టీలు కేవలం అధికారం కోసమే పనిచేస్తున్నాయని, పేదల కొరకు పనిచేసే పార్టీ బీజేపీ మాత్రమేని అన్నారు.

Related Posts