YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఐ వై ఆర్ క్రష్ణా రావు అనుభవాలు..!!

  ఐ వై ఆర్ క్రష్ణా రావు అనుభవాలు..!!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి ఐ వై ఆర్ క్రష్ణా రావు తన అనుభవాలతో రాసిన పుస్తకాలు విజయవాడలో ఆదివారం ఉదయం విడుదలయ్యాయి.

తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రాసిన ఈ పుస్తకాలు కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాలం నాటి అనుభవాల సమ్మేళనం. మొత్తంగా రాష్ట్రం విడిపోయిన నాటి నుండి తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ చేయడంతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవినుండి తప్పుకోవాల్సిన సందర్భం వరకూ జరిగిన అనేక పరిణామాలను, వాటినుండి తన అనుభవాలు, అభిప్రాయాలూ ఈ పుస్తకాల్లో అయన విశ్లేషించారు.

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదిలేసి అర్ధరాత్రి విజయవాడకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు రావలసి వచ్చింది?

ఆయనతో పాటు మొత్తం అధికార యంత్రంగా ఉమ్మడి రాజధాని వదిలి ఎందుకు రావలసి వచ్చింది? వీటి వెనుక ఉన్న “మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ” వ్యాఖ్యల పరిణామం, ప్రభావం వంటి విషయాలు కృష్ణారావు వివరించిన తీరు ఈ ముఖ్యమంత్రిని, ఈ ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచే నేతలను బట్టలూడదీసి బెజవాడ నడిబజార్లో నిలబెట్టింది. కేవలం చంద్రబాబు రాజకీయ స్వార్ధం కోసం మొత్తం రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాజధానిని, అక్కడి వనరుల్ని వదులుకోవాల్సి రావడాన్ని కృష్ణారావు స్పష్టంగా వివరించారు. చంద్రబాబు రాజకీయ దాహానికి రాష్ట్రం ఎలా బలికావాల్సి వచ్చిందో అయన వివరించారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి చందనా ఖాన్ తనకు కేటాయించిన టూరిజం శాఖను ఎలా నిర్వహించారు, తెలంగాణ అధికారులు ఎదురు తిరిగి తన కార్యాలయానికి తాళం వేస్తె ఫుట్ పాత్ పై సమావేశం ఎలా నిర్వహించారో అనే అంశాలను ఉటంకిస్తూ చంద్రబాబు ఇలాంటి ప్రతిఘటన చూపించకపోగా అర్ధరాత్రి ఉమ్మడి రాజధాని వదిలి పారిపోయి రావటాన్ని కృష్ణారావు స్పష్టంగా వివరించారు. పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొని పుస్తకాన్ని తనకు అంకితం చేయడాన్ని స్వాగతించిన చందనా ఖాన్, మరో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లమ్ కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను రాజకీయ కారణాలకోసం వదులుకోవడాన్ని తప్పుపట్టారు.
ఇక ముఖ్యమంత్రి కార్యాలయం ఒక కులక్షేత్రంగా మారి రాష్ట్రంపై ఎలా పెత్తనం చేస్తోందో కూడా అయన వివరించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒకే కులానికి చెందిన వ్యక్తులు, అధికారులు పెత్తనం చేయడం, వారి సూచనలూ, సలహాల మేరకే ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవడం పట్ల కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రజలకు ప్రతిబింబంలా కాకుండా ఒక సామజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించడం చంద్రబాబు పాలనలో కనిపించే దుష్ట సంస్కృతీ.

రాష్ట్ర అధికార యంత్రంగానికి ప్రాతినిధ్యం వహించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం మింగేయడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతిలో నిర్ణయాలు లేకపోవడం, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే జూనియర్ అధికారులే ప్రధాన కార్యదర్శి తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి పాటించాల్సి రావటం వంటి చర్యలను కృష్ణారావు ఎండగట్టారు. తన అజమాయిషీలో ఉండవలసిన అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కారణంగా తనకే పనులు చెప్పే పరిస్థితి రావడం నిజంగా ఐఏఎస్ అధికారులకు, ప్రత్యేకించి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్సులుగా పనిచేసినవారు జీర్ణించుకోలేని పరిస్థితి.

ఈ నాలుగున్నరేళ్ళలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన ఇక భూసేకరణ, భూముల ధారాదత్తం, పరిశ్రమలకు రాయితీలు, పెట్టుబడుల సభలు ఇత్యాది అనేక అంశాలను కృష్ణారావు తన పుస్తకంలో వివరించారు.

ఒక రకంగా చెప్పాలంటే కృష్ణారావు తెలుగు, ఇంగ్లీష్ లో రాసిన ఈ పుస్తకం తెలుగుదేశం ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ అనే చెప్పుకోవాలి. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగ, వ్యవస్థల పతనం వంటి అనేక అంశాలు కృష్ణారావు చక్కగా వివరించారు.

మొత్తంగా ఈ పుస్తకంలో ఏ ఒక్క పేజీ చదివినా, లేక చదవగా విన్నా ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క వ్యక్తీ చంద్రబాబు మళ్ళీ రావాలని కోరుకోడు. చంద్రబాబుకు ఓటు వేయడు. చంద్రబాబు దుష్టపాలననూ, చంద్రబాబు దోపిడీని అంతం చేయాల్సిందే అనేది ఈ పుస్తక సారాంశం. ఇందులో ఒక్క చాప్టర్ కూడా పచ్చ మీడియా కొట్టిపారేయలేదు.

Related Posts