సహజ నటుడు కమల హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిస్తున్న ‘భారతీయుడు 2’ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్టు ప్రకటించి చిత్ర పరిశ్రమను ఆశ్చర్య పరిచారు. ఇదే తన ఆఖరి సినిమా అని పేర్కొన్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రకటించిన ఆయన వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్టు సమాచారం. ఈ నెల 14 నుంచి ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు చెప్పారు.