మలేసియాకు చెందిన ఓ డ్యాన్స్ స్కూల్ యజమాని అళగేశన్ తనతో వ్యాపారం చేయాలనుకున్నాడని సినీ నటి అమలాపాల్ ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాంతో పోలీసులు అళగేశన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే అమలను కలవడానికి ఆమె మేనేజర్ ప్రదీప్ కుమార్ తనకు సాయం చేశాడని అళగేశన్ విచారణలో తెలపగా.. అళగేశన్ ఎవరో తెలీదని ప్రదీప్ అంటున్నాడు. ఈ నేపథ్యంలో అమల కూడా తన మేనేజర్ ప్రదీప్‌కే మద్దతును ఇచ్చింది. ఈ కేసులో మీడియా తన మేనేజర్‌ను తప్పుగా చూపిస్తోందని ఆమె మండిపడింది. ఈ కేసుకు తన మేనేజర్‌కు ఎలాంటి సంబంధం లేదని అమలా పాల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందని.. అందుకే మౌనంగా ఉంటున్నానని.. కానీ ఇలా తప్పుడు వార్తలు రాస్తే మాత్రం దావా వేయడానికి కూడా వెనుకాడనని ఆమె హెచ్చరించింది.