YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మైండ్ బ్లాక్.. మహేష్..!!

 మైండ్ బ్లాక్.. మహేష్..!!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు గా సినీప్రవేశం చేసిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 1979లో "నీడ" అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసారు. మరో ఎనిమిది చిత్రాలలో కూడా అయన చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. 1999లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన "రాజకుమారుడు" చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన  "ఒక్కడు"  చిత్రంతో  స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు మహేష్ బాబు. 2006లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన "పోకిరి" సినిమాతో తొలిసారి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తరువాత వచ్చిన 'అర్జున్', 'సైనికుడు', 'అతిధి' చిత్రాలతో వరుస ప్లాపులు అందుకున్నారు మహేష్. తరువాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళి  త్రివిక్రమ్ దర్శకత్వంలో "ఖలేజా" చిత్రం వచ్చారు... అది కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తరువాత 2011లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన "దూకుడు" చిత్రం తో బాక్సాఫీస్ దగ్గర రికార్డు సృష్టించారు. తరువాత వచ్చిన 'బిజినెస్ మెన్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' భారీ విజయాలు సాధించాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ తరువాత మహేష్ బాబు మాత్రమే భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. తరువాత  2014 లో వచ్చిన "ఆగడు", "1 నేనొక్కడినే" చిత్రాలతో వరుస ప్లాపులతో సతమతమయ్యారు మహేష్. మళ్ళీ 2015 లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన "శ్రీమంతుడు" చిత్రం తో భారీ విజయం సాధించి రికార్డులు అని తన పేరిట రాసుకున్నారు మహేష్. ఈ చిత్రం తో మహేష్ తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళం లో కూడా మంచి ఫాలోయింగ్ సాధించుకున్నారు. తరువాత మళ్ళి 2016 లో వచ్చిన 'బ్రహ్మోత్సవం', తమిళ స్టార్ దర్శకుడు మురుగుదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్పైడర్' చిత్రాలు బాలయ్య బాబు చిత్రాలలో సుమోలులా పేలిపోయాయి. మళ్ళి 'శ్రీమంతుడు' తో మంచి విజయం ఇచ్చినా కొరటాల శివ ని నమ్ముకున్నాడు మహేష్. 2018 లో మరోసారి కొరటాల దర్శకత్వంలో "భరత్ అనే నేను" చిత్రంతో వచ్చి బాక్సాఫీస్ రికార్డు సాధించారు. మహేష్ తన 34 సంవత్సరాల కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్నారు. అయన తన చేసిన చిత్రాలతో ఒక చిత్రాన్ని కూడా రీమేక్ చేయకుండా అన్ని కొత్త కథలనే ఎంచుకున్నారు. అయన ఒక ఇంటర్వ్యూలో నేనెప్పుడూ ఏ సినిమాని రీమేక్ చేయనని చెప్పారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్  ఇండస్ట్రీలో రీమేక్ లు  పంధా నడుస్తుంది. దర్శకులు కూడా అదే దారిలో నడుస్తున్నారు. కనుక మహేష్ బాబు కి కథలు దొరకడం ఆలస్యం అవుతుంది. అందుకేనేమో "ఏ ఏం బి" పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించి. థియేటర్లో టిక్కెట్లు ఆమే వ్యాపారం మొదలు పెట్టారు.  తన నటించిన ఆఖరి చిత్రం విడుదలయి ఎనిమిది నెలలు అవుతున్న ఒక 'మహర్షి'  సినిమాకి తప్ప మరో సినిమాకి సైన్ చేయకపోవడం గమన్హారం..

Related Posts