YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఎల్‌ఐసీ ప్రతిపాదించిన ఓపెన్‌ ఆఫర్‌లో ప్రభుత్వం పాల్గొనడం లేదు - ఐడీబీఐ బ్యాంక్‌

ఎల్‌ఐసీ ప్రతిపాదించిన ఓపెన్‌ ఆఫర్‌లో ప్రభుత్వం పాల్గొనడం లేదు - ఐడీబీఐ బ్యాంక్‌

ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌కు ప్రభుత్వం దూరమైనటు ఐడీబీఐ బ్యాంక్‌ వెల్లడించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ ప్రతిపాదించిన ఓపెన్‌ ఆఫర్‌లో ప్రభుత్వం పాల్గొనడం లేదు. ఐడీబీఐ బ్యాంక్‌లో 26 శాతం వాటా కొనుగోలు నిమిత్తం ఎల్‌ఐసీ చేపట్టనున్న ఓపెన్‌ ఆఫర్‌ ప్రక్రియ డిసెంబరు 3న ప్రారంభమైంది. ఈ నెల 14న ఇది ముగియనుంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 26 శాతం వాటాను ఒక్కో షేరుకు రూ.61.73 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు అక్టోబరులో ఎల్‌ఐసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ.12,602 కోట్లు వరకు చెల్లించనుంది. ‘2018 డిసెంబరు 3 తేదీతో ప్రభుత్వం పంపిన లేఖలో ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌లో పాల్గొనడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింద’ని ఐడీబీఐ బ్యాంక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.ల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌లో పాల్గొనడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింద’ని ఐడీబీఐ బ్యాంక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కాగా.. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాను 51 శాతం పెంచుకునేందుకు ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్‌ షేర్లను జారీ చేసే ప్రతిపాదనకు ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో షేరుకు రూ.61.73 చొప్పున 33.98 కోట్ల షేర్లను కేటాయించేందుకు ఐడీబీఐ బ్యాంక్‌ బోర్డు అంగీకరించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాను 10.82 శాతం నుంచి 51 శాతానికి పెంచుకునేందుకు జూన్‌లో ఎల్‌ఐసీకి ఐఆర్‌డీఏఐ కూడా అనుమతినిచ్చింది.

Related Posts