రేపు ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతున్నారు. ఆయన అహంకారం అతన్ని ఓడిస్తోంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని , మూడు ఎకరాల భూమి ఇవ్వకుండా దళితులని మోసం చేసాడని ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య ఆరోపించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. దళిత ,బలహీన వర్గాలు ఏకమై కేసీఆర్ ను ఓడించాలి. చంద్రబాబు పై అవగాహన రాహిత్యం తో విమర్శలు చేస్తున్నాడు. ఏ ప్రాజెక్టు ను చంద్రబాబు అడ్డుకున్నారో చెప్పాలి. కేసీఆర్ కు ఓటు వేస్తే ,బీజేపీ కు ఓటు వేసినట్లే. జగన్, కేసీఆర్, కేటీఆర్ తో మూడుసార్లు భేటీ అయ్యారు, జగన్ టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తాను అంటే..కేటీఆర్ వద్దన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తెలంగాణ ఎన్నికల పై నీ విధానం ఏమిటో చెప్పలేదు. టీఆర్ఎస్ తో ఇంకా భేరం కుదరలేదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఏ కూటమి వైపు ఉంటాడో తేల్చిచెప్పాలని అయన అన్నారు.