దొంగ లెక్కల రెడ్డి విజయసాయిరెడ్డి పిచ్చి కూతలు కూస్తున్నాడు. వైసీపీ ఆత్మ కేసీఆర్, అంతరాత్మ కేటీఆర్. తెలంగాణ లో మీ వైసీపీ ఎమ్మెల్యే లు టీఆర్ఎస్ లో చేరితే ఖండించలేదు. కనీసం గవర్నర్ కు పిర్యాదు చేయలేదని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. మిషన్ భగీరథ కాంట్రాక్టులను వైసీపీ ఎమ్మెల్యే లకు ఇచ్చారు. వైసీపీ బహిరంగంగా టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తోందని అన్నారు. కేసీఆర్ ఆంధ్రాద్రోహి ..అతనికి ఎలా మద్దతు ఇస్తారు. ప్రత్యేక హోదా కు అడ్డుపడిన కేసీఆర్ కు మద్దతు పలుకుతారా. మిమ్మల్నిఏపీ ప్రజలు క్షమించరరని ఆమె అన్నారు. మహిళ లేని మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన ఘనత కె సి ఆర్ కీ దక్కిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ పార్టీ నుంచి శివ కుమార్ ని శాశ్వతంగా బహిష్కరించడం లొనే టీ ఆర్ ఎస్ పార్టీ తో ఉన్న లోపరికారం ఒప్పందం బయటపడిందనీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో కె సి ఆర్ ప్రజా సభలు నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులు వెళ్లి పని చేయడం దారుణమని అన్నారు. మత ప్రచారకుడు అయిన బ్రదర్ అనిల్ కుమార్ తెలంగాణ రాష్ట్రం లో పరోక్షంగా వారికి సహకరించడం జరుగుతుందని ఆమె ఆరోపించారు. కేసిఆర్ పక్క రాష్ట్రంలో తిత్లీ తుపాను కారణంగా రాష్ట్రం అతలకుతం అయిపోతే ఏ మాత్రం సహకరించలేదని విమర్శించారు.