ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. తెలుగులో ఎన్టీఆర్ .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లు సెట్స్ పై వున్నాయి. ఇక కాంతారావు బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో జయలలిత బయోపిక్ కి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో జయలలిత పాత్ర కోసం చాలామంది కథానాయికల పేర్లను పరిశీలించారు. చివరికి ఆ అవకాశం నిత్యామీనన్ కి దక్కింది. నిత్యామీనన్ ప్రతిభ కలిగిన నటి అనే విషయం అందరికి తెలిసిందే. ఆమె స్కిన్ టోన్ .. గ్లామర్ .. హైట్ ఇవన్నీ కూడా జయలలితకు కాస్త దగ్గరగా ఉండటం వలన, ఈ పాత్రకి ఆమెనే కరెక్ట్ అనుకున్నారు. 'ది ఐరన్ లేడీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి, తాజాగా నిత్యామీనన్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందనే బలమైన నమ్మకంతో నిత్యామీనన్ వుంది. హాస్పిటల్లో దీర్ఘకాలం చికిత్స పొందిన ఆమె కోలుకున్నట్టే కనిపించారు, కానీ ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో ఆమెకు చికిత్స అందించగా.. ఆమె మరణం పట్ల ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. అమ్మను చూశామని మేం అబద్ధం చెప్పాం. ఎవరూ ఆమెను కలవలేదని జయ మరణించిన 9 నెలల తర్వాత తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్యలు అమ్మ మరణం పట్ల అనుమానాలను మరింత పెంచాయి. జయ మరణం పట్ల అనుమానాలను పక్కనబెడితే ఆమె మంచి భోజన ప్రియరాలు. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా.. నచ్చిన ఆహారం తినడానికి ఆమె ఆసక్తి చూపేవారు. ఆమెకు ఇష్టమైన ఆహారం తీసుకోవడానికి మించిన ఆనందం మరొకటి లేదని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ శివకుమార్ తెలిపారు. జయ కుటుంబంలో ఒకడిగా మెలిగిన ఆయన శశికళకు సమీప బంధువు. డాక్టర్లు ఆహారం, వ్యాయామం గురించి చెబుతున్న.. తనకు నచ్చింది తినడానికి అమ్మ ఇష్టపడేదని శివకుమార్ తెలిపారు. ప్లాస్టిక్ సర్జన్ అయిన శివకుమార్.. జయకు అందించిన చికిత్సను పర్యవేక్షించారు. జయ మరణం పట్ల అనుమానాలు తలెత్తడంతో తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందు హాజరైన ఆయన్ను జస్టిస్ ఆర్ముగస్వామి ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ‘జయలలిత స్పృహలోకి వచ్చి మాట్లాడితే.. ఆమె కుటుంబ సభ్యుడిగా మెలిగిన మీరు.. సర్జరీ చేయాలని ఎందుకు అనుకోలేద’ని ఆయన ప్రశ్నించారు. యాంజియోగ్రామ్ ఎందుకు చేయలేదన్నారు. దీనికి శివకుమార్ బదులిస్తూ.. డాక్టర్ చెరియన్, డాక్టర్ బ్రహ్మానందం యాంజియోగ్రామ్ పట్ల విముఖత వ్యక్తం చేశారన్నారు. జయ ఆరోగ్యం మెరుగుపడటానికి అవసరమైన చికిత్సను డాక్టర్లు అందించారు, ఈ విషయంలో తాను సంతృప్తిగా ఉన్నానని శివకుమార్ తెలిపారు. విదేశాల్లో చికిత్స అందించడాన్ని కేవలం ఓ ఆప్షన్‌గా మాత్రమే పరిగణించామని ఆయన చెప్పారు. జయ ఆరోగ్యం మెరుగుపడటంతో విదేశాల్లో చికిత్స అవసరం లేదని డాక్టర్ బియాలే తెలిపారన్నారు.