మాజీ సైనికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమంలో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో సంక్షేమ భవనాలను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సైనికుల సేవలను ఆయన కొనియాడారు. సైనికుల త్యాగాన్ని మరువలేనిదని ఆయనచెప్పారు. విధి నిర్వహణలో కుటుంబాలకు సైతం దూరం గా ఉంటూ దేశ రక్షణ కోసం తమ జీవితాన్నే పణంగా పెడుతున్న సైనికులను భారత మాత ముద్దు బిడ్డలుగా అభివర్ణించారు. త్రివిధ దళాలు దేశ భద్రతతో పాటు విపత్కర పరిస్ధితుల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని చినరాజప్ప ప్రశంసించారు. దేశప్రజలు సుఖ శాంతులతో జీవనం సాగిం చేందుకు తమ జీవితాలను త్యాగం చేస్తున్న సైనికులు ప్రజల హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచి ఉంటారన్నారు. సాయధ దళాల పతాక నిధికి రికార్దు స్ధాయిలో విరాళాలను సేకరించిన ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లను, జిల్లా సైనిక సంక్షేమ అధికారులను చినరాజప్ప ప్రశంసిం చారు. ఈ సందర్భంగా వారిని మెమంటోలతో సత్కరించారు