ఆర్థిక శాఖ, రెవెన్యూ ఆర్జిత శాఖల ఉన్నతాధికారులతో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది బడ్జెట్ లో ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. పేదరికం నిర్మూలన, రైతులకు, సమానత్వం, గ్రామీణాభివృద్ధి, యువతకు ఉద్యోగకల్పన, అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వృద్ధి రేటు, ఎఫ్ఆర్ బీఎం, బిల్లుల చెల్లింపు, ఇరిగేషన్ బకాయిలు, నగదు నిర్వహణ, పాలనానుమతులపై చర్చ జరిగింది. రెవెన్యూ ఆర్జితలో నిర్ణయించిన లక్ష్యాలు సాధించమని అధికారులను మంత్రి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖలో చెల్లింపులు వినియోగదారులకు సులభతరం చేయాలని అధికారులకు సూచించారు.